
కాగా ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లాండు గడ్డపై అడుగుపెట్టిన ఇరుజట్ల ఆటగాళ్లు ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల తీవ్రంగా వేధిస్తుంది. టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు గాయం కారణంగా ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది.
అయితే కేవలం భారత జట్టుకు మాత్రమే కాదు అటు ఆస్ట్రేలియాకు కూడా భారీ ఎదురుదెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఆ జట్టులో కీలక ప్లేయర్ దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్నారు జోష్ హెజిల్ వుడ్. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతను కోలుకుని డబ్ల్యూటీసి ఫైనల్ నాటికి అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని ప్లేస్ లో మైఖేల్ నేజర్ ను జట్టులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా బోర్డు తెలిపింది. ఐపీఎల్ లో బెంగళూరు తరఫున కొన్ని మ్యాచ్లు ఆడిన హేజిల్ వుడ్ గాయంతో టోర్ని నుంచి తప్పుకున్నాడు.