
అయితే అటు టీమిండియా మాత్రం వరుసగా రెండోసారి డబ్ల్యుటిసి ఫైనల్ లో అడుగు పెట్టడం గమనార్హం. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది టీమిండియా జట్టు. దీంతో విశ్వవిజేతగా నిలుస్తుంది అనుకుంటే.. కేవలం రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకుంది అని చెప్పాలి. అయితే వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన నేపథ్యంలో ఇక తప్పులను సరిదిద్దుకొని ఈసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ లో గెలిస్తే మూడు ఫార్మాట్లలో వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన ఏకైక టీం గా వరల్డ్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది టీమిండియా. మరోవైపు ఆస్ట్రేలియా గెలిచిన ఇదే చరిత్ర రిపీట్ అవుతుంది.
ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్ పై ఇక టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి డబ్ల్యూటీసి ఫైనల్ కు బాగా సన్నదమయ్యాము అంటూ చెప్పుకుచ్చాడు. ఎలాగైనా గెలిచి టైటిల్ ని సొంతం చేసుకుంటాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు. కొంతమంది ప్లేయర్లు గాయాలపాలు అయినప్పటికీ అనుభవం ఉన్న ప్లేయర్లు జట్టులో ఉండడం కలిసి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. జట్టులో రహానే కీలక పాత్ర పోషిస్తాడని.. బాగా రాణిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయి అంటూ రాహుల్ ద్రవిడు చెప్పుకొచ్చాడు.