అయితే ప్రజెంట్ భారత జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లతో పోస్ట్ చూస్తే అటు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకే ఎక్కువ క్రేజ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే క్రికెట్ లోకి అడుగుపెట్టే ఎంతోమంది యంగ్ క్రికెటర్లు ధోనిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ధోనితో ఒక్క మ్యాచ్ ఆడిన చాలు జీవితానికి అది సరిపోతుంది అని ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఆశ పడుతూ ఉంటారు. అయితే అలాంటి ధోని గురించి ఇక అతని సహచరుడు గౌతమ్ గంభీర్ మాత్రం ఎప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎన్నోసార్లు ధోని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన గౌతం గంభీర్ ఇటీవలే మరోసారి తన నోరు పారేసుకున్నాడు. 2007, 2011 వరల్డ్ కప్ లు ధోని సారధ్యంలో గెలిచింది టీమిండియా. అయితే భారత్ సమిష్టిగా రానించి వరల్డ్ కప్ గెలిస్తే కెప్టెన్ ధోనిని హీరోని చేశారని గౌతమ్ గంభీర్ విమర్శించాడు. icc ట్రోఫీలో గెలవడం మహేంద్ర సింగ్ ధోనీకే సాధ్యమని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఐసీసీ టోర్నమెంట్లలో మనోళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యమిస్తారు. వేరే జట్లు సమిష్టిగా ప్రదర్శన చేస్తాయి. 2007, 2011 ప్రపంచ కప్ లు భారత్ గెలిచిందంటే యువరాజ్ సింగ్ కారణం అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి