భారత జట్టు లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన ఆట తీరుతో ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా కోహ్లీ సుపరిచితుడుగా మారి పోయాడు. అంతేకాదు ఎంతోమంది క్రికెట్ లవర్స్ ని తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక ఇప్పటివరకు కోహ్లీ సాధించని రికార్డు అంటూ మరొకటి లేదు అనేంతల విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియా లో తన ఫిట్నెస్ తో ప్లేయర్లందరికీ కూడా ఫిట్నెస్ ప్రమాణాలు పెంచేసాడు.


 అయితే ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఎంతో అలవోకగా చేదించాడు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇంకా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలా ఏదో నిరూపించుకోవాలనే కసి ప్రతి మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. అయితే కోహ్లీని అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా రికార్డుల రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే కోహ్లీ కూడా ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొడుతూ ఉంటాడు అని చెప్పాలి.


 విరాట్ కోహ్లీ ప్రతిభ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ జట్టుపై నాయకత్వం అధికారాన్ని ఎప్పటికీ కోరుకోడు అంటూ సంజయ్  వ్యాఖ్యానించాడు. అచ్చం సచిన్ టెండూల్కర్ లాగానే విరాట్ కోహ్లీ కూడా క్రికెట్ ఆడటానికి ఎంతగానో ఆస్వాదిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నో ఏళ్లపాటు టీమిండియా కు కెప్టెన్గా వ్యవహరించడంతో కోహ్లీ కల నెరవేరింది అంటూ తెలిపాడు. సుదీర్ఘ టెస్ట్ ఫార్మాట్లో సచిన్ 51 సెంచరీలు చేశాడని.. ఈ రికార్డును కోహ్లీ  బద్దలు కొట్టడం కష్టమే అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేస్తారని అందరూ అంచనాలు పెట్టున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: