మొన్నటికి మొన్న ముగిసిన ఆసియా కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు దారుణంగా విఫలమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా టీమిండియా చేతిలో అయితే చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో ఇక వరల్డ్ కప్ కి ముందు పాకిస్తాన్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది అనడంలో సందేహం లేదు. అయితే ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా పాకిస్తాన్ తప్పుకున్న తర్వాత  ఆ చెట్టు ఆటగాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే సాధారణంగానే పాకిస్తాన్ జట్టులో ఆటగాళ్ల మధ్య ఎప్పుడూ సమానమైన అభిప్రాయం ఉండదు. ఒక్కొక్కరిది ఒక్క దారి అన్నట్లుగా పాకిస్తాన్ ప్లేయర్లో తీరు ఉంటుంది అని చెప్పాలి. ఇదే ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది  ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాళ్లు తరచూ డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ పడుతూ ఉంటారు అన్న వార్త కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవలే ఆసియా కప్ లో శ్రీలంక మీద పాకిస్తాన్ ఓడిపోయిన వెంటనే.. డ్రెస్సింగ్ రూమ్ లో షాహీన్ ఆఫ్రిది కెప్టెన్ బాబర్ కి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది అన్నది తెలుస్తుంది.


 అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న శాదాబ్ ఖాన్ సైతం కెప్టెన్ బాబర్ పై కీలకమైన వ్యాఖ్యలు చేసాడు. గ్రౌండ్ లోకి వచ్చాక బాబర్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి   ఆయన నిర్ణయాలు మాకు నచ్చవు  ఆయన కెప్టెన్సీ ని మేము పెద్దగా ఎంజాయ్ చేయలేము. కానీ మ్యాచ్ అయిపోయాక మాత్రం చాలా ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి ఉంటాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాగా కెప్టెన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన షాదాబ్ ఖాన్ పై పాక్ క్రికెట్ బోర్డు వేటు వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టీం నుంచి అతని తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: