
అయితే కొంతమంది క్రికెటర్లు మాత్రం అటు ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా దూరం అవుతూ పూర్తిగా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడూ అభిమానులందరికీ కూడా ఇలాంటి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు స్టార్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్. ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆల్ టైం బెస్ట్ బ్యాట్స్మెన్లలో అలిస్టర్ కుక్ ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. కెరియర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించి ఎన్నో మ్యాచ్లలో జట్టును ముందుకు నడిపించాడు.
అయితే ఇక ఇప్పుడు అతను ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అన్ని ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కౌంటి సీజన్ తనకు చివరిది అంటూ పేర్కొన్నాడు. కాగా అలిస్టర్ కుక్ కెరియర్లో 161 టెస్టుల్లో 65.4 సగటున 33 సెంచరీలు 57 అర్థ సెంచరీలతో 12,472 పరుగులు చేశాడు. ఇక 2018 లోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ప్రస్తుతం కౌంటిల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు కౌంటి క్రికెట్ నుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు ఈ మాజీ ప్లేయర్.