అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా ఈ ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ కు వెళ్లబోయే టీమ్స్ ఏవి ఇక ఫైనల్లో తలబడబోయే జట్లు ఏవి అనే విషయంపై తమ అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో మాజీ ఆటగాళ్లు చెప్పేస్తున్నారు. దీంతో ఇలాంటి రివ్యూలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే మొన్నటి వరకు ఆసియా కప్ జరగడానికి ముందు ఇక  మాజీ ఆటగాళ్ళు టాప్ ఫోర్ కి వెళ్లబోయే టీమ్స్  లలో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా తప్పకుండా ఉంటాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడైతే ఆసియా కప్లో ఆయా జట్ల ప్రదర్శన చూశారో.. ఇక ఇప్పుడు తమ అంచనా తప్పు అని  మళ్ళీ సరికొత్తగా రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగకర మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ జట్లు ఏవి అనే విషయంపై తన రివ్యూ ఇచ్చేశాడు ఈ మాజీ ప్లేయర్.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి జట్లను కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు. పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ తదితర జట్లు తప్పకుండా టాప్ ఫోర్ లో ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ కుమార సంగంకర మాత్రం ఈ అభిప్రాయాలతో విభేదించాడు. తన అభిప్రాయం ప్రకారం ఇంగ్లాండ్, భారత్ టాప్ ఫేవరేట్లు. ఆసియా కప్ లో శ్రీలంక ఆట నేను గమనించా. వాళ్ళ ఆట తీరు చూస్తే ప్లే ఆఫ్ స్థానం కోసం గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు. అదే జరిగి ప్లే ఆఫ్ కి వస్తే ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్ చేరుకోవచ్చు. ఆ రోజు గనుక శ్రీలంక బాగా ఆడితే ఫైనల్ చేరిన చేరుతుంది అని కుమార సంగకర చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: