భారత్ వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే జట్లు కొన్ని ఉన్నాయి  ఇలా టైటిల్ ఫేవరెట్ అనుకుంటున్న టీమ్స్ లలో అటు పాకిస్తాన్ జట్టు కూడా ఒకటి అని చెప్పాలి. భారత దాయాది దేశమైన పాకిస్తాన్.. ఎప్పుడు టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా జట్టు ఎంతో పటిష్టంగా ఉండడంతో.. ఇలా భారత్ వేదికగా వరల్డ్ కప్ పక్క ప్రణాళికలతో బరీలోకి దిగుతుంది.


 పాకిస్తాన్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ ఆటగాళ్లు ఇక్కడ హైదరాబాద్లో న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడారు అని చెప్పాలి. అయితే ఈ వార్మప్ ఆఫ్ మ్యాచ్ లో ఇక పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోయారు. మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ తో చెలరేగితే అటు కెప్టెన్ బాబర్ 80 పరుగులు చేసి సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మరో బ్యాట్స్మెన్ షకీల్ సైతం 75 పరుగులు చేసి రాణించాడు అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూసిన తర్వాత వారెవ్వా.. ఏం కసితో భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో బలోకి దిగారు. ఇలా అయితే పాకిస్తాన్ నుంచి అన్ని టీమ్స్ కి గట్టి పోటీ ఉంటుంది అని అందరూ అనుకున్నారు.


 కానీ ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ వరల్డ్ కప్ ప్రస్థానాన్ని పాకిస్తాన్ ఓటమితోనే మొదలుపెట్టింది. వార్మప్ మ్యాచ్లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 345 పరుగులు చేసింది. అయితే 346 పరుగుల టార్గెట్ ను అటు కివీస్ జట్టు 43.4 ఓవర్లలోనే ఎంతో సులభంగా ఛేదించింది. రవీంద్ర 97, చాప్ మన్ 65, మిచెల్ 59, విలియమ్సన్ 54 పరుగులతో ఆకట్టుకున్నారు. అయితే ఇలా ఓటమితో వరల్డ్ కప్ ప్రస్థానాన్ని.. పాకిస్తాన్ మొదలుపెట్టడంతో ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు. వార్మాప్ మ్యాచ్ లోనే ఇంత పెద్ద టార్గెట్ కాపాడుకోకపోతే.. ఇక అసలు మ్యాచ్లలో ఏం ఆడతారు అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: