మరికొన్ని రోజుల్లో 2023 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. అయితే టీమ్ ఇండియా చివరిసారిగా 2011లో వరల్డ్ కప్ గెలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై ప్రపంచకప్ ఆడుతున్న నేపథ్యంలో 2011 వరల్డ్ కప్ గురించి కూడాఎంతోమంది మాజీ ప్లేయర్లు చర్చించుకుంటూ ఉన్నారు.


 2011 వరల్డ్ కప్ సమయంలో కెప్టెన్ గా ఉన్న ధోని కోచ్గా ఉన్న గ్యారి కిర్ స్టన్  పెట్టిన రూల్స్ గురించి ఇటీవల వీరేంద్ర సెహ్వాగ్  చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ కోసం ఎంపికైన ఆటగాళ్లు ఎవరూ కూడా న్యూస్ పేపర్ చదవద్దని.. అంతేకాదు టీవీలు చూడోద్దని బయట వారి మాటలు పట్టించుకోవద్దని ధోని కూడా చెప్పాడు. ఎందుకంటే అలాంటివి ఆటగాళ్లపై ప్రెషర్ తీసుకొస్తాయి అంటూ తెలిపాడు. ఇక ఆ సమయంలో కలిసే పార్టీలు చేసుకున్నాం. కలిసే ఎక్సర్సైజులు చేశాం. కలిసే తిన్నాం. కలిసే పడుకున్నాం. మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా ఏ ప్లేయర్ గదికి వెళ్ళేందుకు ధోని అనుమతి ఇచ్చేవాడు కాదు  అందరూ కలిసి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.


 ఇలా ఆటగాళ్లందరూ కలిసి ఉన్న సమయంలో మేమంతా క్రికెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. డిన్నర్ టైం క్రికెట్ స్ట్రాటజీ గురించి చర్చించుకునే వాళ్ళం. నేను కూడా నా సలహాలు ఇచ్చేవాడిని. 2011 వరల్డ్ కప్ విజయానికి ఇవి కూడా ఒక కారణం. ఎందుకంటే ప్లేయర్లు కలిసికట్టుగా జట్టుగా ఉండేలా చూసుకోవడం చాలా కష్టం. ధోని దానిపై ఎంతో ఫోకస్ పెట్టాడు. మా పైన ఒత్తిడి కూడా ఉండేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వరల్డ్ కప్ గెలవాలి అని చెప్పేవాళ్ళు. ధోని ఒక్కటే లైన్ చెప్పేవాడు. ఫోకస్ ఎప్పుడూ ప్రయత్నం మీద ఉండాలి  మన ప్రయత్నం సరిగా ఉంటే విజయం అదే వస్తుంది అంటూ చెప్పాడు. ధోని చెప్పినట్లుగానే 2011 వరల్డ్ కప్ విజయం సాధించాం అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: