
దాదాపు 6 మంది కామెంటేటర్లకు ఈ కామెంటరీ ప్యానెల్లో్ చోటు దక్కినట్టు సమాచారం. అందులో ఇద్దరు కామెంటేటర్లు పాకిస్థాన్ నుంచి వుండడం గమనార్హం. 31 మంది వన్డే ప్రపంచకప్ కామెంటేటర్ల ప్యానెల్లోా దిగ్గజాలు సైతం వున్నారనే సంగతి తెలియండికాదు. మ్యాచ్ కామెంటరీతో పాటు ప్రీ మ్యాచ్ షో, మిడ్ ఇన్నింగ్స్, పోస్ట్ మ్యాచ్ కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నారు. కాగా, ఈసారి పాకిస్థాన్ కామెంటేటర్ వసీమ్ అక్రమ్కుక కామెంటరీ ప్యానెల్లోు చోటు దక్కకపోవడం కొసమెరుపు. అదేవిధంగా ఇండియా నుంచి ఆకాశ్ చోప్రా కూడా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
అయితే ఈ ప్రపంచ కప్ కోసం కామెంటేటర్‌గా రమీజ్ రాజాను ఎంపిక చేయడం పట్ల ఐసీసీపై కొందరు భారత అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటంటే? పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్గాల ఉన్నప్పుడు రమీజ్ అన్న మాటను గుర్తు చేస్తున్నారు. ఆసియాకప్ కోసం టీమిండియాగాని పాకిస్థాన్కుత రాకపోతే, ప్రపంచకప్ కోసం తమ జట్టు ఇండియాకు ఎత్తిపరిస్థితుల్లో వెళ్లబోదని రమీజ్ అప్పట్లో అన్నమాటలను గుర్తుచేసుకొని కస్సుబుస్సు మంటున్నారు. అవును, అప్పట్లో అంతటి ఘాటు వ్యాఖ్యలు చేసిన రమీజ్నుస ప్రపంకప్ కామెంటరీ ప్యానెల్లోదకు ఎందుకు తీసుకున్నారని ఐసీసీని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఆకాశ్ చోప్రాను తీసుకొని ఉండే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.