
అదే వన్డేలో కోహ్లి 80 బంతుల్లోనే 45వ వన్డే శతకాన్ని సాధించి రికార్డ్ సెట్ చేశాడు. మూడు ఫార్మాట్లలో ఇది కింగ్ కోహ్లీకి 73వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా టెస్టుల్లో మనోడు 27, టీ20ల్లో ఒక సెంచరీ సాధించిన సంగతి విదితమే. అలా కోహ్లీ స్వదేశంలో 20 సెంచరీలు చేసిన బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. అలా తన 73వ అంతర్జాతీయ శతకాన్ని సాధించిన కోహ్లి 257 ఇన్నింగ్స్‌లలో 12500 వన్డేల్లో వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టెండూల్కర్‌ను అధిగమించి కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.
ద్వీపవాసులు(శ్రీలంక)పై భారత బ్యాటర్ చేసిన అత్యధిక శతకాలు ఇవే కావడం గమనార్హం. ఈ నేపధ్యంలోనే క్రికెట్ క్రీడా పండితులు ఓ విశ్లేషణ చేశారు. ఐసిఅసి వైట్ బాల్ టోర్నీలో భారత్ తరుపున అత్యధికంగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలవడానికి విరాట్ కోహ్లీకి మరెన్ని రోజులో పట్టదని అంటున్నారు. అవును, అతగాడు మరో 20 రన్స్ చేస్తే సచిన్ (2719) పరుగుల రికార్డును సునాయాసంగా బ్రేక్ చేస్తాడు. కాగా ఈ విషయం తెలిసిన విరాట్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.