భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ పేరును సార్ధకం చేసే విధంగానే కోహ్లీ ఆట తీరు కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి.. దాదాపు పుష్కరకాలం గడిచిపోతుంది. అయినప్పటికీ కోహ్లీ కొత్తగా జట్టులోకి వచ్చిన క్రికెటర్ లాగా ఎంతో కసిగా ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎంతోమంది లెజెండ్స్ క్రియేట్ చేసిన రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.


 కానీ ఇంకా ఏదో సాధించాలనే కసి మాత్రం విరాట్ కోహ్లీలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై మ్యాచ్ అనే విధంగానే అతని ఆట తీరు ఉంటుంది. ఇక అతనిలో ఉన్న ఎనర్జీనే ప్రత్యర్ధులు కోహ్లీ పేరు ఎత్తితే భయపడేలా చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు మూడు ఫార్మాట్లకు భారత కెప్టెన్ గా వ్యవహరించి అదిరిపోయే ప్రదర్శనలు చేసిన కోహ్లీ ఇప్పుడు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆటగాడిగా మాత్రం జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. అయితే అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కోహ్లీ సాధించిన ఒక రికార్డు హాట్ టాపిక్ గా  మారింది.


 2019 ప్రపంచ కప్ లో టీమిండియా కు కెప్టెన్ గా ఉన్నాడు కోహ్లీ. అయితే ఈ టోర్నీలో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా పై 82, పాకిస్తాన్ పై 77, వెస్టిండీస్ పై 72, ఆఫ్ఘనిస్తాన్ పై 77,  ఇంగ్లాండ్పై 66 పరుగులు చేశాడు. దీంతో అరుదైన రికార్డు కోహ్లీ పేరిట వచ్చి చేరింది. అప్పటివరకు ప్రపంచకప్ టోర్నీలలో ఏ కెప్టెన్ కూడా ఈ ఘనత సాధించలేదు. గతంలో కెప్టెన్ హోదాలో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఫించ్, సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పేరిట ఉంది అని చెప్పాలి. మరి కోహ్లీ పేరిట ఉన్న ఈ రికార్డు ఈ వరల్డ్ కప్ లో బద్దలవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: