
కానీ విరాట్ కోహ్లీ అటు టీమిండియా ఆడబోయే మొదటి మ్యాచ్ కు అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది. ఎందుకంటే తిరువనంతపురంలో జరగాల్సిన రెండో వార్మప్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ హఠాత్తుగా ముంబైకి చేరుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది. ఇక టీమిండియా ఫోటోషూట్ లో కూడా కోహ్లీ కనిపించలేదు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో గందరగోల పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.
అయితే ఈ గందరగోలాలు అన్నింటికీ కూడా విరాట్ కోహ్లీనే ఇటీవలే తెరదించాడు. ఇటీవల చెన్నైలో అడుగుపెట్టిన టీమిండియా.. జట్టులో విరాట్ కోహ్లీ కూడా కనిపించాడు. దీంతో అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి మ్యాచ్లో ఇక భారత జట్టులో తాను ఉంటాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. కాగా విరుష్క దంపతులు రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అందుకే సడన్గా జట్టు నుంచి తప్పుకుని ముంబై వెళ్లాడు అని సమాచారం. అయితే తాను జట్టులో ఉండడం ఎంత ఇంపార్టెంట్ తో అర్థం చేసుకొని కోహ్లీ మళ్ళీ తిరిగి జట్టు లోకి వచ్చి చేరాడు. దీంతో అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.