ఇటీవల కాలంలో భారత క్రికెట్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఎవరు అంటే అతను యంగ్ బ్యాట్స్మెన్ రింకు సింగ్. గత ఐపీఎల్ సీజన్ నుంచి కూడా ఇతని పేరు భారత క్రికెట్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి ఎంతోమంది యంగ్ క్రికెటర్లు బ్యాటింగ్లో అదరగొడుతున్నారు. కానీ రింకు సింగ్ మాత్రం ఎంతో స్పెషల్. ఎందుకంటే అందరూ ఓపెనర్లుగా రావడం లేదంటే వన్ డౌన్ లో వచ్చి మంచి బ్యాటింగ్ చేయడం చేస్తూ ఉన్నారు. కానీ రింకు సింగ్ మాత్రం భారత జట్టును ఎన్నో రోజులుగా వేధిస్తున్న మిడిల్ ఆర్డర్ సమస్యను తీర్చే ఆటగాడిగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకు సరైన ఫినిషర్ ఎక్కడ దొరకలేదు. అయితే భారత సెలెక్టర్లు ఎంతోమంది ప్లేయర్లతో ప్రయోగాలు చేసినప్పటికీ.. ఇక ఆ ప్రయోగాలన్నీ కూడా బెడిసికొట్టాయ్. ఇలాంటి సమయంలోనే రింకు సింగ్ ఇక అటు ఐపీఎల్ లో ఒక్క ఇన్నింగ్స్ తో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆ తర్వాత కూడా మెరుపు బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు భారత జట్టు తరుపున కూడా ఇలాంటి ఫినిషింగ్ ఇస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి   అయితే ఇలా ఎవరైనా ప్లేయర్ మంచి ప్రదర్శనతో హాట్ టాపిక్  మారిపోతే అతని క్రేజ్ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది.


 రింకు క్రేజ్ కూడా ఇలాగే పెరిగింది. కానీ అతనికి ఒక విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుంది. అదేంటి ఐపీఎల్లో రాణిస్తున్నాడు. టీమిండియాలో కూడా చోటు దక్కింది. ఇంకా అన్యాయం ఎక్కడ జరిగింది అంటారా. ఎవరు పట్టించుకోని ఒక విషయం వెలుగులోకి వచ్చింది. రింకు సింగ్ వేలంలో ఉంటే అతనికి కోట్లు పెట్టి జట్టులోకి తీసుకునేందుకు అన్ని టీమ్స్ రెడీ అయ్యాయి. కోల్కతా మాత్రం ఈ ఆణిముత్యాన్ని వదులుకునేందుకు సిద్ధం కాలేదు. జట్టుతోనే రిటైన్ చేసుకుంది. కానీ అతని పాత ధర మాత్రం పెంచలేదు. గత ఐపిఎల్ సీజన్లో అతని కోసం 55 లక్షలు చెల్లించిన కోల్కతా.. ఇక ఇప్పుడు కోటిలోపే చెల్లిస్తుందట. అతను బాగా రాణిస్తున్న ధర విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: