గత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఎవరు అంటే.. అందరూ హార్థిక్ పాండ్యా పేరే చెబుతారు. ఎందుకంటే అతను ఏకంగా గుజరాత్ టైటాన్స్  జట్టులో కెప్టెన్సీ వదులుకొని అటు ముంబై టీంలోకి  రావడం అందులోని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇదే విషయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 ఏ విధంగా గుజరాత్ టైటాన్స్ జట్టు 15 కోట్ల రూపాయలు చెల్లించి.. జట్టులోకి తీసుకోవడమే కాదు.. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ కూడా అప్పగించింది. అతని కెప్టెన్సీ లోనే గుజరాత్ ఒకసారి టైటిల్ విజేతగా.. రెండోసారి రన్నరప్ గా కూడా నిలిచింది. అయితే అలాంటి గుజరాత్ జట్టును వదిలేసి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లోకి రావాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్న విషయం ఇప్పటికే ఎవరికీ అర్థం కావట్లేదు అని చెప్పాలి. అయితే ఇలా టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ పాత టీమ్ అయినా ముంబై ఇండియన్స్ లోకి రావడంతో ఇక ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా మీకు వస్తూ ఉన్నాయి.


 ఎన్నో ఏళ్లపాటు హార్దిక్ పాండ్య అటు ముంబై ఇండియన్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ముంబైలోకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటివరకు అతనికి ఎంత మొత్తంలో చెల్లించారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. 2017లో మొదటిసారి పది లక్షలు చెల్లించి పాండ్యని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. 2017 ఐపిఎల్ సీజన్ వరకు ఇదే ధర కొనసాగింది. ఇక 2018 నుంచి 2021వరకు ఏడాదికి 11 కోట్లు చెల్లించింది. ఇక 2022 వేలంలో అతని గుజరాత్ 15 కోట్లు పెట్టి కొనుకుంది. ఇక ఇప్పుడు అదే ధరకు ముంబై కూడా సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు 89.5 కోట్లు ఐపిఎల్ తో సంపాదించాడు.  ఇక వాణిజ్య  ప్రకటనల ఆదాయం అదనం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: