
అది కూడా 121 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకోవడం గమనార్హం. అయితే ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడతాడు కాబట్టి.. ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ను మ్యాడ్ మాక్సీ అని పిలుస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు. అయితే ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య భారత్ వేదికగా ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కుర్రాళ్ళతో కూడిన భారత జట్టు ఆస్ట్రేలియాతో తలబడుతుంది అయితే ఇక కుర్రాళ్ళు అయినా ఒత్తిడికి గురి కావడం లేదు. అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఆదిత్యాన్ని కూడా సొంతం చేసుకుంది టీమిండియా. ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్లో కూడా భారత జట్టు విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ ఊహించనీ రీతిలో మూడో టి20 మ్యాచ్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరీ ముఖ్యంగా మ్యాడ్ మాక్సి మరోసారి తన వీర బాదుడితో భారత బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఏకంగా 41 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాక్స్వెల్ సెంచరీపై కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాక్స్వెల్ వేసిన 20వ ఓవర్ లో 30 పరుగులు రావడంతో మాక్సీ అసహనానికి లోనయ్యాడు. ఆ కసి తోనే సెంచరీ చేశాడు. లేకపోతే సెంచరీ చేసేవాడు కాదేమో అంటూ కామెంట్ చేశాడు. కాగా 18 ఓవర్ వరకు ఆస్ట్రేలియా ఓడిపోతుందని అందరు భావించగా.. చివరి రెండు ఓవర్లలో మాక్స్వెల్ మ్యాచ్ స్వరూపం మొత్తం మార్చేశాడు.