
అయితే ఇక ఈసారి మినీ వేలంలో స్టార్ ప్లేయర్లు కూడా ఉండడంతో ఎంతోమంది ప్లేయర్లు.. భారీ ధర పలికే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం జరుగుతూ ఉండగా.. అంతకుముందే కొన్ని టీమ్స్ మాత్రం ఆటగాళ్లను మార్చుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి ఒకే టీం అంటిపెట్టుకొని ఇక ఆ జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న కొంతమంది ఆటగాళ్లు.. ఏకంగా మరో టీంలోకి మారబోతున్నారు అంటూ వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి.
అయితే ఐపీఎల్లో బుమ్రా పేరు చెప్పగానే.. గుర్తుకు వచ్చేటి ముంబై ఇండియన్స్. ఒక కుర్రాడిలా ముంబై ఇండియన్స్ లోకి అడుగుపెట్టిన బుమ్రా ఇక ఆ తర్వాత తన ప్రతిభను నిరూపించుకుని.. భారత జట్టులోకి వచ్చాడు. ఇక్కడ కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుని భారత జట్టులో కీలక బౌలర్ గా మారిపోయారు. ముంబై ఇండియన్స్ లో కూడా రోహిత్ తర్వాత కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు బుమ్రా. అలాంటి బుమ్రా ఇక ఇప్పుడు ముంబైని వదిలేసి మరో టీంలోకి వెళ్లబోతున్నాడట. అది కూడా కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టులోకి వెళ్లబోతున్నాడట బుమ్రా. ఇటీవల అతను ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. హార్దిక్ రావడంతో ఇక కెప్టెన్సీ తనకు రాదని ఉద్దేశంతోనే బుమ్రా ఇలా మరో టీం లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.