
ఇలా ఒక బ్యాట్స్మెన్ పరుగులు చేయకుండా.. ప్రతి బంతిని డిఫెండ్ చేస్తూ ఉంటే.. బౌలర్లకు మాత్రమే కాదు టెస్ట్ మ్యాచ్లను చూస్తున్న ప్రేక్షకులకు కూడా కాస్త చిరాకు వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి టెస్ట్ ఫార్మాట్లో అటు ఇంగ్లాండ్ జట్టు సరికొత్త పద్ధతిని పరిచయం చేసింది. ఏకంగా బజ్ బాల్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది అని చెప్పాలి. ఈ కొత్త విధానం ద్వారా అందరిలాగా నెమ్మదిగా ఆచితూచి ఆడటం కాదు.. ఏకంగా టి20 ఫార్మాట్లో లాగానే బ్యాటింగ్ విధ్వంసం కొనసాగించి బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఉంటారు బ్యాట్స్మెన్లు. అయితే ఇక ఈ కొత్త పద్ధతితో కొన్నిసార్లు ఇంగ్లాండ్ సక్సెస్ అయితే ఇంకొన్నిసార్లు మాత్రం విఫలమై విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి.
అయితే భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కూడా బజ్ బాల్ ఆడతాము అంటూ ఇంగ్లాండ్ క్రికెటర్ ఓలీ పోప్ అన్నారు. ఇప్పటివరకు టెస్టుల్లో ఎలా అయితే ఆడామో.. ఇక ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్ లో కూడా అలాగే ఆడుతాం. పరుగులు సాధించాలంటే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే భారత్లో మ్యాచ్ గెలవడం అంత ఈజీ కాదు. కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతాం అంటూ కామెంట్ చేశాడు ఓలి పోప్. కాగా ఇంగ్లాండ్ టీమిండియా పర్యటనకు రాబోతుండగా. జనవరి 25వ తేదీ నుంచి ఈ రెండు టీమ్స్ మధ్య ఐదు మ్యాచ్లు జరగబోతున్నాయి.