
ఇకపోతే ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోయే టీమ్ ఇండియా జట్ల వివరాలను కూడా ప్రకటించింది. టి20 ఫార్మాట్కు సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్కు కేఎల్ రాహుల్ ఇక టెస్ట్ ఫార్మాట్ కి రోహిత్ శర్మ సారాధ్య కెప్టెన్సీ వహించబోతున్నారు. అయితే ఇటీవల భారత సెలక్టర్లు జట్టు ఎంపిక విషయంలో ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న చాహల్ కి అటు సౌత్ ఆఫ్రికా టూర్ లో ఏ ఫార్మాట్లో కూడా జట్టులో చోటు దక్కలేదు.
ఇలా సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ కి స్పిన్నర్ చాహాల్ ను ఎంపిక చేయకపోవడం పై మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ సెటైర్లు వేశాడు. టి20 ఫార్మాట్లో మెరుగ్గా రాణిస్తూ ఉంటే.. ఈ ఫార్మాట్లో అతనికి అవకాశం ఇవ్వకుండా వన్డేల్లో ఛాన్స్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. చాహల్ కు సెలక్టర్లు లాలిపాప్ ఇచ్చారు అంటూ సెటైర్లు వేశాడు. ఒక ఆటగాడు రాణిస్తున్న ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఎలా ఎంపిక చేస్తారు అంటూ జట్టు సెలక్షన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు హార్భజన్ సింగ్.