
ఇక ఎంతోమంది లెజెండ్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి రికార్డుల రారాజు అని ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు పరుగుల వరద పాలిస్తూ రన్ మిషన్ అనే మరో బిరుదును కూడా అందుకున్నాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలు ఒక్కసారిగా మారిపోయాయ్. ఎందుకంటే ఒకప్పుడు ఫిట్నెస్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని కోహ్లీ ఆ తర్వాత మాత్రం ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ఇక ఇప్పటికీ కూడా ఫిట్నెస్ కాపాడుకోవడం విషయంలో విరాట్ కోహ్లీని మించిన మరో ప్లేయర్ టీమిండియాలోనే కాదు వరల్డ్ క్రికెట్లో కనిపించరు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే అశ్విన్, రోహిత్ లాంటి ఫిట్నెస్ పై దృష్టి పెట్టడం లేదంటూ ఎప్పుడు విమర్శలు వస్తుంటాయి ఇదే విషయంపై అశ్విన్ స్పందించాడు. ఫిట్నెస్ విషయంలో తాను ఎంత కష్టపడినా కోహ్లీలా కాలేను అంటూ చెప్పుకొచ్చాడు. ఆట కోసం ఫిట్గా ఉండటం ఎంతో ముఖ్యం. అందుకోసం కష్టపడుతున్న.. నాకు ఇష్టమైన ఆహారాన్ని నా లైఫ్ స్టైల్ ని త్యాగం చేయాల్సి వచ్చింది. అథ్లెటిక్ లక్షణాలు లేవు అన్న ట్యాగ్ నాకు ఎప్పుడో వచ్చింది. అయినా నేను ఆగిపోలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన కోసం కష్టపడుతూనే ఉన్నా అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.