భారత క్రికెట్ లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఎవరు అంటే అతను నయా ఫీనిషర్ రింకు సింగ్ అని చెప్పాలి. గతంలో ఐపీఎల్ సీజన్లో మెరుపు బ్యాటింగ్ తో ఒక్కసారిగా అందరూ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ యంగ్ బ్యాట్స్మెన్ అదరగొట్టాడు. ప్రస్తుతం అటు ఆస్ట్రేలియాతో భారత జట్టు ఆడుతున్న టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు రింకు సింగ్.


 అయితే ఐపీఎల్ టోర్నీలో ఎలా అయితే అతను తన బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించి అదరగొట్టాడో.. ఇక ఇప్పుడు భారత జట్టు తరఫున కూడా అదే రీతిలో వీరవిహారం చేస్తూ ఉన్నాడు. దీంతో గత కొంతకాలం నుంచి భారత జట్టును వేధిస్తున్న ఫినిషర్ రోల్ కి తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాడు రింకు సింగ్. ఏకంగా చివరి ఓవర్లలో వచ్చి స్కోర్ బోర్డుకు సైతం ఆయాసం పుట్టేలా పరుగుల వరద పారిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ఇన్నింగ్స్ లపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.


 రింకు సింగ్ బ్యాటింగ్ విధ్వంసం గురించి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ అయిన వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రు రస్సెల్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్లను తాను ఫాలో అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ లైవ్ మిస్ అయితే హైలెట్స్ కచ్చితంగా చూస్తున్నాను అంటూ తెలిపాడు. అయితే కేవలం రింకు సింగ్ బ్యాటింగ్ చూడటం కోసం మాత్రమే ఈ మ్యాచ్ లు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రింకు సత్తా ఏంటో తనకు తెలుసునని.. కోల్కతా ప్రాక్టీస్, నెట్ సెషన్ లో భారీ షాట్లు ఆడేవాడు అంటూ గుర్తు చేసుకున్నాడు. అతను అద్భుతమైన ఆటగాడని భవిష్యత్తులో మరింత బాగా రాణిస్తాడు అన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: