
ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా స్కోర్ చేస్తూ ఉంది యంగ్ టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టీ20 మ్యాచ్లలో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో మాత్రం ఇక భారత్ ఓడిపోయింది. ఇక ఇటీవల జరిగిన నాలుగో మ్యాచ్లో విజయం సాధించి.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది భారత జట్టు. అయితే ఇలా ఆస్ట్రేలియాపై సిరీస్ ను కైవసం చేసుకున్న యువ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇక ఇదే విషయంపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా విధ్వంసకరమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన రింకు ఇక మరో ప్లేయర్ జితేష్ లను కూడా ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేసారు.
నాలుగో t20 మ్యాచ్ లో ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభం ఇచ్చారు. ఫియర్లెస్ క్రికెట్తో మంచి ఫినిషింగ్ ఇచ్చిన రింకు సింగ్. జితేష్ శర్మ లకు సెల్యూట్ చేయాల్సిందే. అక్షర్ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు ఇక సిరీస్ సాధించిన జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్ కి శుభాకాంక్షలు అంటూ జై షా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అయితే ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు రింకు సింగ్ ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లలో కూడా తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఏకంగా అతను భారత జట్టుకి ఫ్యూచర్ ఫినిషర్ అనే విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేసాడు అని చెప్పాలి.