టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇక నేటి తరానికి లెజెండ్ గా కొనసాగుతున్న క్రికెటర్ మాత్రం విరాట్ కోహ్లీనే అని చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడిలాగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా అతని ఆట తీరులో ఇలాంటి మార్పు రాలేదు.


 కొత్తగా జట్టులోకి వచ్చి ఏదో నిరూపించుకోవాలని కలలుగనే యువ ఆటగాడిలాగానే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కేవలం ఆట విషయంలోనే కాదు ఫిట్నెస్ విషయంలో కూడా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు. ఇక మైదానంలో అతని ఎనర్జీ చూసి ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోతుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా క్రికెట్ ని ఫ్యాషన్ గా మార్చుకుని అటువైపు అడుగులు వేసే కుర్రాళ్ళు అందరూ కూడా విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఒక లెజెండరీ క్రికెటర్ కూడా ఏకంగా కోహ్లీ లాగే తన కొడుకును ఉండమని చెబుతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా. ఇటీవల విరాట్ కోహ్లీ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఏదైనా క్రీడ ఆడాలి అనుకుంటే విరాట్ కోహ్లీలోని నిబద్ధత అంకితభావాన్ని అలవర్చుకోవాలని చెబుతాను. అతని నైపుణ్యం మాత్రమే కాకుండా.. నెంబర్ వన్ ఆటగాడిగా ఎదగడానికి విరాట్ కోహ్లీ ఏం చేశాడు అన్న విషయాన్ని కూడా చూసి నేర్చుకోవాలని చెబుతాను అంటూ బ్రియాన్ లారా కామెంట్ చేశాడు. అయితే లారా ఇలాంటి కామెంట్స్ చేయడంతో కోహ్లీ అభిమానులకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: