
దీంతో 4-1 తేడాతో అటు భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకున్నందుకు అందరూ హ్యాపీగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం కెప్టెన్ సూర్య కుమార్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న సమయంలో ఐదవ టి20 మ్యాచ్ ను నామమాత్రమైన మ్యాచ్ గానే ఆడింది టీం ఇండియా. అయితే అప్పటివరకు తుది జట్టులో ఒక్కసారి కూడా ఛాన్స్ దక్కించుకోని వాషింగ్టన్ సుందర్.. శివం దూబే లకు నామమాత్రమైన మ్యాచ్లో ఛాన్స్ దక్కుతుందని అందరూ అనుకున్నారు.
కానీ చివరికి అభిమానులకు నిరాశ ఎదురయింది. వరుసగా నాలుగు మ్యాచ్ లలోను అక్షర పటేల్, రవి బిష్ణయ్ లనే కొనసాగించారు వారి స్థానాలలో వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలను ఆడించి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హార్దిక్ పాండ్యాకు బ్యాక్అప్ గా శివం దూబేను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ గుర్తు చేస్తున్నారు. అయితే వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ టీమిండియా పరాజయానికి ఫేస్ ఆల్ రౌండర్ లేకపోవడమే కారణమని.. కనీసం టి20 ప్రపంచ కప్ కైనా ఆ సమస్య లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడితే బాగుంటుందని టీమిండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందుకే సూర్య తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.