
ఎందుకంటే ఏ బంతిని ఎటు వైపుకు బౌండరీకు తరలిస్తాడు అన్న విషయం ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. ఇక అతని దూకుడైన బ్యాటింగ్ చూసి ఎక్కడ బంతి వేయాలో కూడా తెలియక బౌలర్లు తికమక్క పడిపోతూ ఉంటారు అంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగుతూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా తన అద్భుతమైన ఆటతీరుతో అంతర్జాతీయ టి20 లలో ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా అవతరించాడు సూర్య కుమార్ యాదవ్. ఇక గత కొంతకాలం నుంచి తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటూనే వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇటీవల టి20 ర్యాంకింగ్స్ నూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే మరోసారి సూర్య బాయ్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. 881 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన టి20 సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన రుతురాజ్ 673 రేటింగ్ పాయింట్స్ తో ఏడవ స్థానానికి చేరుకున్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో 55.75 సగటుతో 223 పరుగులు చేశాడు రుతురాజ్. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రుతురాజ్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.