బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించె ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది. ఈ టి20 టోర్నీ అయితే ఇక ప్రతి ఏడాది కూడా భారీ అంచనాల మధ్య ప్రారంభమై ఐపీఎల్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడం వల్ల భారీగా ఆదాయంతో పాటు మంచి ప్రదర్శన చేస్తే ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయ్. అందుకే ఇక విదేశీ క్రికెటర్లు అందరూ కూడా అంతర్జాతీయ మ్యాచ్లకు డుమ్మా కొట్టి మరి ఐపీఎల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా ఐపీఎల్లో పాల్గొనడం వల్ల ఆటలో ఎంతో అనుభవం సాధించి అంతర్జాతీయ క్రికెట్లో కూడా రాణిస్తున్నారు క్రికెటర్లు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాలనుకున్న యువ ఆటగాళ్లకు అయితే ఐపీఎల్ ఒక మంచివేదికగా మారిపోయింది అని చెప్పాలి.


 కాగా ఐపీఎల్ టోర్నీ పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఆడే చివరి టోర్నమెంట్ ఐపీఎల్ కావచ్చు అంటూ కామెంట్ చేశాడు. నేను నడవలేని పరిస్థితికి చేరుకునే వరకు కూడా తప్పకుండా ఐపీఎల్లో పాల్గొంటాను అంటూ తెలిపాడు. 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ ఆల్ రౌండర్ మాక్స్వెల్. ఇక ప్రస్తుతం రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టులో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కాగా ఆర్సిబి 2024 ఐపీఎల్ సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl