విరాట్ కోహ్లీ దగ్గర నుంచి సారధ్య బాధ్యతలు అందుకున్న తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతలా సక్సెస్ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  తన కెప్టెన్సీ తో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ఐదు సార్లు ట్రోఫీ అందించి ఎలా అయితే మ్యాజిక్ చేసి చూపించాడో.. ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా కూడా అంతే సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాలి.  ఇప్పటికే భారత జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ.


 ఇక ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో  కూడా భారత జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  సెమీఫైనల్ వరకు టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడకుండా దూసుకుపోయింది. ఒక ఫైనల్ మ్యాచ్లో ఓటమి మినహా మిగతా వరల్డ్ కప్ టోర్నీ మొత్తం టీమిండియా ప్రస్థానం అద్భుతంగా సాగింది అని చెప్పాలి. కాగా రోహిత్ గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. 2024 t20 వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ మళ్లీ టి20 ఫార్మాట్లోకి వస్తాడా లేదా అన్నది అందరిలో నెలకొన్న సందేహం.


 అయితే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందని ఇప్పటికే ఎంతోమంది మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయంపై ఇప్పుడు రోహిత్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. టి20 వరల్డ్ కప్ కు సారధిగా రోహిత్ అయితేనే సరైన వ్యక్తి అని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశంలో కెప్టెన్సీ అంశాలపై చర్చ జరిగింది ఈ క్రమంలోనే తనకు టి20 వరల్డ్ కప్ కెప్టెన్సి పై క్లారిటీ ఇవ్వమని.. రోహిత్ అడుగగా ఇక రోహిత్కే టి20 కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం సరైంది అని బిసిసిఐ పెద్దలతో పాటు కోర్సు రాహుల్ ద్రావిడ్ కూడా భావించాడట. దీంతో త్వరలోనే రోహిత్ టి20లోకి వచ్చి మళ్లీ జట్టును ముందుకు నడిపించబోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: