
ఇక ఇటీవల అత్యుత్తమ ప్రదర్శన చేసి ఐసిసి ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతివారం కూడా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ర్యాంకింగ్స్ ప్రకటించడం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం సొంతం చేసుకోవాలని ప్రతి ఒక ఆటగాడు కూడా ఆశపడుతూ ఉంటాడు. తమకు ర్యాంకింగ్స్ పైన ఆశ లేదని జట్టు విజయం కోసమే ఆడుతున్నామని చెప్పినప్పటికీ.. ఇక అగ్రస్థానం కోసం మాత్రం ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటారూ అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఈ అగ్రస్థానం భారత యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణయ్ దక్కింది.
అంతర్జాతీయ టి20 లలో నెంబర్ వన్ బౌలర్గా అవతరించాడు ఈ యువ ఆటగాడు. 699 రేటింగ్ పాయింట్లతో రవి బిష్ణయ్ అగ్రస్థానంలో నిలిచాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 692 పాయింట్లు రెండవ స్థానంలోకి పడిపోయాడు. ఇక భారత జట్టు తరఫున 21 మ్యాచ్లో 34 వికెట్లు పడగొట్టిన ఈ యువ సంచలనం ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన టి20 సిరీస్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. ఇక మరోవైపు t20 ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా నయా మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు అని చెప్పాలి.