గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించాలంటే ఏం చేయాలి. వామ్మో అలాంటి ప్రపంచ రికార్డు సృష్టించాలి అంటే అది మామూలు విషయమా.. ఎవరికి సాధ్యం కాని పనిని చేసి చూపించినప్పుడే గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. నిజమే గతంలో ఎంతోమంది ఇలా ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి ఇక ఆ పనిని తమలాగా ఇంకెవరు చేయలేరు అనే విషయాన్ని నిరూపించి.. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటారు.


 దీంతో ఇక ఈ రికార్డు గురించి తెలిసినవారు ఇలాంటి విన్యాసాలు చేయడం మా వల్ల కాదు బాబోయ్ గిన్నిస్ బుక్ రికార్డు లేకపోయినా పర్వాలేదు అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు గిన్నిస్ బుక్ వరల్డ్ రికరు సాధించడం కోసం చేస్తున్న పనులు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంత ఈజీ పనులు చేసి కూడా వరల్డ్ రికార్డు సాధించవచ్చా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. రోజు చేసే పనులను కాస్త కొత్తగా ట్రై చేసి వరల్డ్ రికార్డు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇలాగే గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. ఇక ఇలా ప్రపంచ రికార్డు సృష్టించారంటే ఏదో కఠినమైన పని చేసే ఉంటారు అనుకుంటే పొరపాటే.


 ఎందుకంటే గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడం కోసం వాళ్ళు కష్టమైన పని చేయలేదు. ఏకంగా మద్యం తాగారు. అదేంటి మేం కూడా మద్యం తాగుతాం.. అలా అయితే ప్రపంచ రికార్డు సృష్టించవచ్చా అంటారా.. ఫుల్ డీటెయిల్స్ తెలిస్తే మీరే షాక్ అవుతారు. 26 ఏళ్ల ఇద్దరు యువకులు హరి క్రూరోస్,  లోయిటర్న్ గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 24 గంటల్లో  అత్యధికంగా 99 పబ్ లలో మద్యం సేవించారు. దీంతో వీరికి గిన్నిస్ బుక్ రికార్డు వరించింది. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన హేన్రిక్ డిబిలియర్స్ 24 గంటల్లో 78 పబ్లలోకి వెళ్ళగా ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టారు ఇద్దరు యువకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: