
అయితే ఇక టి20 వరల్డ్ కప్ కోసం కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటే బాగుంటుంది అని అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బీసీసీఐ పెద్దలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దీంతో రోహిత్ మళ్లీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది. కానీ కోహ్లీ మాత్రం టి20 ఫార్మాట్లోకి వస్తాడా లేదా అనే విషయంపై అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విరాట్ అటు టి20 లోకి వచ్చేందుకు సుముఖంగా లేడు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతనికి ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడిందట బీసీసీఐ.
ఈ క్రమంలోనే కోహ్లీ ఆడే మూడవ స్థానంలో ఎవరిని బ్యాట్స్మెన్ గా బరిలోకి దింపితే బాగుంటుంది అని దానిపై కసరతులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే 2024 t20 వరల్డ్ కప్ కోసం ఇషాన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్ లాంటి బ్యాటింగ్ నెంబర్ మూడు స్థానంలో ఆడితే మొదటి నుంచే ప్రత్యర్థి టీం పై ఒత్తిడి పెంచవచ్చు అని టీ మేనేజ్మెంట్ భావిస్తుందట. దీంతో కోహ్లీ స్థానంలో అతని ఆడించాలని సెలెక్టర్లు ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.