ఇటీవల కాలం అంతర్జాతీయ క్రికెట్లో యువ ఆటగాళ్లదే హావా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో అంతంత మాత్రం అనుభవమున్న యంగ్ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. దీంతో యువ ఆటగాళ్ల ప్రతిభతో ఎంతో మంది సీనియర్ల కెరియర్ కూడా ప్రమాదంలో పడిపోతూ ఇక జట్టులో చోటు కోల్పోతూ ఉన్నారు. అయితే కేవలం మనదేశంలోనే కాదు ఏ దేశంలో చూసినా ఇలా యంగ్ ప్లేయర్స్ సత్తా చాటుతూ ఉన్నారు. వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 మెన్స్ ఆసియా కప్ టోర్నీలో కూడా ఇలా యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా దూకుడుగా ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ యంగ్ బౌలర్ జిశాన్ ఏకంగా సంచలనమే సృష్టించాడు అని చెప్పాలి. ఆరు అడుగుల 8 ఇంచులు పొడవు ఉండే.. ఈ యువ బౌలర్ ఏకంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ తో ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. ఒక రకంగా ప్రత్యర్థి నేపాల్ టీం నడ్డి విరిచాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మ్యాచ్లో ఈ యువ ఆటగాడు కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. దీంతో ఇక వన్డే ఫార్మాట్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండవ పాకిస్తాన్ బౌలర్గా  జిశాన్ రికార్డు నెలకొల్పాడు. 2018 లో షాహిన్ అఫ్రీది 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటి చరిత్ర సృష్టించగా.  ఇక ఇప్పుడు జిశాన్ ఏకంగా 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టి ఇక వన్డే ఫార్మాట్లో రెండవ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు అని చెప్పాలి. ఇక అతను ఈ టోర్నీ మొత్తం ఇలాగే రాణిస్తే త్వరలోనే పాకిస్తాన్ జాతీయ టీమ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: