అయితే వన్డే సిరీస్ లో భాగంగా సఫారీ జట్టును వారి సొంత గడ్డమీద ఊహించని షాక్ ఇచ్చింది. మొదటి మ్యాచ్ లోను విజయం సాధించి శుభారంభం చేసింది. ఇటీవల సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇక టీమిండియా బౌలర్లు మెరుపులాంటి బంతులు విసిరి అదరగొట్టేసారు. ఈ క్రమంలోనే సఫారీ జట్టు బ్యాటింగ్ విభాగం మొత్తం పరుగులు చేయడంలో విఫలమై చివరికి పేక మెడల కూలిపోయింది అని చెప్పాలి. ఏకంగా సౌత్ ఆఫ్రికా ను భారత్ 116 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఇక ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా చేదించింది టీమిండియా.
ఈ క్రమంలోనే ఈ విజయంతో టీమిండియా పలు రికార్డులను బద్దలు కొట్టింది అని చెప్పాలి. వన్డే ఫార్మాట్లో సఫారీలు జట్టు సొంత గడ్డపై చేసిన అతి తక్కువ స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతేకాదు బంతులు పరంగా చూసుకుంటే 200 బంతులు తేడాతో ఓటమి కూడా వారికే క్రికెట్ చరిత్రలో రెండు అతిపెద్ద ఓటమి. సౌత్ ఆఫ్రికా పై వన్డే ఫార్మాట్ లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత ఫేసర్ గా అర్షదీప్ చరిత్ర సృష్టించాడు. కాగా ఈ ఏడాది భారత బౌలర్లు ఏకంగా 8సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం గమనార్హం. ఏది ఏమైనా వన్డే ఫార్మాట్లో సీనియర్లు లేకపోయినప్పటికీ కుర్రాళ్ళు మాత్రం అదరగొట్టేస్తున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి