చెన్నై సూపర్ కింగ్స్.. ఈ పేరు గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ టీంగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ధోని సారథ్యంలో ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ధోని కెప్టెన్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కి ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. గత ఏడాది ఐపిఎల్ టైటిల్ విజేతగా కూడా నిలిచింది.


 ఇక ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్లో కూడా పక్క ప్రణాళికలతో బరిలోకి దిగి టైటిల్ గెలవడానికి సిద్ధమవుతోంది అని చెప్పాలి. ఇక మరోసారి ధోని ఆటను చేసేందుకు అటు జట్టు అభిమానులు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు. వీటిలో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఇటీవల ఎన్నికల బాండ్ల రూపంలో ఏ పార్టీకి ఎవరు ఎంత మొత్తంలో విరాళం అందించారు అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఇటీవల వెల్లడించింది. దీంతో ఏ కంపెనీ ఏ వ్యక్తి ఏ పార్టీకి ఎంత మొత్తంలో డబ్బులు విరాళంగా ఇచ్చాడు అన్న విషయం బహిర్గతం జరిగింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఛాంపియన్ టీంగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఒక పార్టీకి ఏకంగా ఐదు కోట్ల రూపాయల విరాళం అందించింది అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. తమిళనాడులోని అన్నాడిఎంకే  పార్టీకి ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్  మెజారిటీ విరాళాలను అందజేసింది. ఆ పార్టీకి 6.05 కోట్ల విరాళాలు రాగా వాటిలో.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అయిదు కోట్ల విరాళాలు అందజేయడం గమనార్హం. ఈ విషయాన్ని ఈసీ అధికారికంగా తెలిపింది. ఇక 2019లో ఏప్రిల్ లో ఈ విరాళం ఇచ్చినట్లు ఈసీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl