అయితే కెప్టెన్సీలో కూడా తనకు తిరుగులేదు అని రోహిత్ శర్మ ఇప్పుడు వరకు నిరూపించాడు అన్న విషయం తెలిసిందే. కేవలం టీమ్ ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాత్రమే కాకుండా గతంలో ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఏకంగా ఆ జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ లలో ఒకడిగా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా కెప్టెన్ గా కూడా భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్పును అందించి హిస్టరీ క్రియేట్ చేశాడు.
అయితే ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్నప్పటికీ రోహిత్ శర్మ ఎప్పుడు తన తోటి ఆటగాళ్లతో సరదాగానే గడుపుతూ ఉంటాడు. ఈ క్రమం లోనే రోహిత్ గురించి ఇటీవల జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సినిమా లగాన్లో అమీర్ ఖాన్ పాత్రత తరహాలో రోహిత్ శర్మ నిజ జీవితంలో ఉంటారు అంటూ క్రికెటర్ సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. జట్టులో అందరిని గౌరవంతో చూస్తాడు. రోహిత్ చాలా భిన్నమైన వ్యక్తి. మేము చాలా సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు రోహిత్ అన్నయ్య లాంటి మనిషి. కొత్త కుర్రాళ్లను కూడా తనతో సమానంగానే ట్రీట్ ఇస్తాడు. ఆయన కెప్టెన్సీలో ఆడటానికి ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం.