
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అంపియర్లు సైతం బ్యాట్ మ్యాన్ల యొక్క బ్యాట్స్ సైతం అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే ఆదివారం జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచులో అంపియర్స సైతం ప్లేయర్ల బ్యాట్స్ని చెక్ చేశారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా బ్యాట్ ను ఆన్ ఫీల్డర్ అంపియర్ కూడా చెక్ చేయడం జరిగింది. మ్యాచ్లో ఆడడానికి వచ్చిన పాండే బ్యాట్ చెక్ చేయడం కోసం ఒక పరికరాన్ని కూడా ఉపయోగించారు. అయితే అదృష్టవశాత్తు పాండ్యా బ్యాట్ అన్ని కొలతలకు అనుగుణంగానే ఉన్నది.
అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఆర్సిబి, రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో కూడా ఫిల్ సాల్ట్ , షిమ్రాన్ ప్లేయర్లు బ్యాచ్ ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ బ్యాట్లను చెక్ చేయడానికి ఒక పరికరాన్ని కూడా ఉపయోగించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ ఒక బ్యాట్ 4.25 అంగుళాలు లేదా..10.8 సెంటీమీటర్ల వెడల్పులను మాత్రమే కలిగి ఉండాలి. బ్యాట్ యొక్క బ్లేడ్ కింద కొలతల విషయానికి వస్తే .. వెడల్పు 4.25 in/10.8cm.. అంచులు 1.56in/4.0cm.. లోతు 2.6in/6.7cm ఉండాలి. అలాగే బ్యాడ్ గేజ్ కూడా ఉండాలి. అయితే ఐపీఎల్ లో చెక్ చేసిన ప్లేయర్స్ యొక్క బ్యాటు మొత్తం కూడా అన్ని నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయట.