- ( స్పోర్ట్స్ - ఇండియా హెరాల్డ్ ) . . .

స‌మ‌కాలీన క్రికెట్ ప్రపంచంలో బ్యాడ్ లక్ అంటే దక్షిణాఫ్రికాదే అని చెబుతారు. ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ వన్ టీంగా… దిగ్గజ ఆటగాళ్లు ద‌శాబ్దాలుగా ఆ జ‌ట్టులో ఉన్నా కూడా ఆ జ‌ట్టు చిన్న చిన్న తప్పిదాల‌కు తోడు దుర‌దృష్ట క‌ర సంఘ‌ట‌న‌ల వ‌ల్ల మూడు ద‌శాబ్దాల కు పైగా క్రికెట్ ప్రపంచకప్ ను గెల్చుకోలేకపోయింది. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాదో ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పటి వరకూ ఆ జట్టు ఖాతాలో ప్రపంచకప్ లేదంటే పెద్ద షాకే అనుకోవాలి. ఇక భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదీ అదే పరిస్థితి. బెంగళూరు మొదటి నుంచి ఫేవరేట్ టీం. సూపర్ ఆటగాళ్లు ఆ జ‌ట్టులో ఎంద‌రో ఉన్నారు.. కోహ్లీ లాంటి వజ్రం ఆ జ‌ట్టులో స‌భ్యుడి గాను ఉన్నాడు.. కొన్ని సీజ‌న్ల‌కు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఇక ప్ర‌తి సీజ‌న్ లోనూ ఆర్సీబీ క‌ప్ గెలుస్తుంద‌ని ఎప్పటికప్పుడు ఆశలు రేపడం.. తర్వాత ఓడిపోవడం కామన్ అయిపోయింది.


చివరిగా ఆర్సీబీ టీం 9 ఏళ్ల కిందట ఫైనల్ చేరింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం ఉంది. క్వాలిఫయర్ లో ఏకపక్షంగా గెలిచి ఫైనల్ చేరుకున్నారు. ఇంకొక్క అడుగు వేస్తే ..ఆ చివ‌రి అంకం కూడా గ‌ట్టెక్కేస్తే టైటిల్ అందుకుంటారు. ఇక ఇప్పుడు టోట‌ల్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ క్రికెట్ అభిమానులు అంద‌రూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే కప్ అందుకోవాలని అనుకుంటున్నారు. కనీసం కోహ్లీ కోసమైనా కప్ ఆ జట్టు గెలవాలని సగటు క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సారి ఫైనల్ రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సాధించడం ఖాయంగా క్రికెట్ ప్రేమికులు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఇక ఆర్సీబీ తో ఫైన‌ల్ ఆడేందుకు ఎవ‌రు వ‌స్తారు ?  పంజాబా.. ముంబైనా అన్నది మ్యాటర్ కాదు.. క‌ప్ మాత్రం ఆర్సీబీ నే కొట్టాల‌న్న కోరిక అంద‌రిలోనూ బ‌ల‌ప‌డి పోయింది. అయితే చిన్న సందేహం ఏంటంటే ఐపీఎల్ లో ఆర్సీబీకి ఇప్పటి వరకూ ఎదురవుతున్న దురదృష్టాన్ని చూసి.. చాలా మంది భయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలా కాకూడదని మొక్కులు మొక్కు కుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: