ఇక‌ మన భారతదేశంలో క్రికెట్‌కు , చిత్ర పరిశ్రమకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి .. చిత్ర పరిశ్రమలో ఉండేవారితో క్రికెటర్లకి కూడా సన్నిహిత సంబంధాలు ఉండటం ఎప్పుడు నుంచో వస్తున్న విషయమే .. అలాగే ఎంతో మంది క్రికెటర్స్ సినిమా స్టార్స్ ను పెళ్లి చేసుకున్నారు కూడా .. ఇక బాలీవుడ్ స్టార్స్ తో ఎంతో మంది టీమిండియా స్టార్ క్రికెటర్స్ తో సన్నిహిత సంబంధాలు అలాగే వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి .. అందుకే చాలా సందర్భాల్లో క్రికెటర్స్‌ సినిమాల్లో కనిపిస్తున్నారు .. కొన్నిసార్లు చిన్న పాత్రలో నటించడం మనం చూస్తూనే ఉన్నాం .. మరికొందరు ఫుల్ లెన్త్ పాత్రలో నటిస్తూ వస్తున్నారు .. రీసెంట్ టైంలో ఇది ఎంతో కామన్ గా మారిపోయింది .


ఇక ఇప్పటికే టీమిండే క్రికెటర్స్ లో కపిల్ దేవ్, ఇర్ఫాన్ పటాన్, శ్రీకాంత్, హర్భజన్ సింగ్ లో పాటు మరికొందరు లేడీ క్రికెటర్స్ కూడా సినిమాల్లో నటించి అదరగొట్టారు .. అలాగే టీమ్ ఇండియ‌ క్రికెటర్ శ్రీకాంత్ హీరోగా  నటించి ఎన్నో ప్రశంసలు కూడా తెచ్చుకున్నారు .. ఇలా చాలామంది క్రికెటర్స్‌ వారి జీవితాలు వెండితెరపైకు తీసుకువచ్చి ఎన్నో విజయాలు కూడా అందుకున్నారు .. అందుకే ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ ఏదో ఒక సమయంలో సినిమాల్లో కనిపించడం లేదా వారి జీవిత చరిత్ర సినిమాగా రావటం ఎంతో కామన్ గా మారిపోయింది .. ఇక ఇప్పుడు త్వరలోనే మరో స్టార్ క్రికెటర్ కూడా సినిమాల్లో కనిపించబోతున్నాడు .  ఒక తమిళ సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని తెలుస్తుంది .


ఐపీఎల్ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ క్రికెటర్గా వెలిగిన సురేష్ రైనా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నాడు .. గతంలో పలు కమర్షియల్ యాడ్స్ లో  నటించిన అనుభవం రైనా కి ఉంది .. అలాగే కేవలం కమర్షియల్ యాడ్స్ లో మాత్రమే కాకుండా కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ యాడ్స్ లోను నటించారు .. అలాంటిది ఇప్పుడు సినిమాల్లో నటించే సమయంలో ఇతనికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు .. ఒక తమిళ సినిమా కోసం సురేష్ రైనాను సంప్రదించగా ఆయన నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .. అలాగే ఈమధ్య కాలంలో సౌత్ సినిమాలకు పాన్ ఇండియ‌ రేంజ్ లో మంచి గుర్తింపు వస్తుంది .. అందుకే తమిళ సినిమాలో సురేష్ రైనా నటించేందుకు ఓకే చెప్పాడని అంటున్నారు .


ఇక‌ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా 226 వన్డేలు ఆడి 35. 31 సగటుతో 5615 రన్స్ సాధించాడు .. అలాగే 36 అర్థసంచరీలు, 5 శతకాలు తన ఖాతాలో ఉన్నాయి .. అదే విధంగా 13 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆటపై తన దృష్టి సారించాడు చిన్న వయసులోనే అండర్ 16 ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు .. అలాగే అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్లో కూడా పర్యటించాడు 2004లో అండర్ 19 ప్రపంచకప్ పోటీల్లో కూడా తన ప్రాతినిధ్యం వ‌హించాడు .. ఆ ప్రపంచ కప్పు పోటీల్లో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం మూడు అర్థ సెంచరీలు సాధించాడు .. లెజెండ్రి క్రికెటర్ సచిన్ కు గాయం అవ్వడంతో 2005లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ లో కూడా రైనా పాల్గొన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: