ఇక ఫేస్ బుక్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరి ఫోన్లలో కూడా ఈ ఫేస్ బుక్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక్కసారి కూడా ఫేస్ బుక్ ఓపెన్ చేయకుండా అసలు ఎవరూ ఉండలేరు.ఇక కొంతమంది అయితే ఫేస్ బుక్ లో ఎన్నో గంటలకొద్ది గడుపుతూ ఉంటారు. ఫ్రెండ్స్ తో ఛాటింగ్ తో పాటు ఫీడ్ చూసుకుంటూ లైక్ లు కూడా కొడుతూ ఉంటారు. ఇంకా అలాగే పోస్టులు పెడుతూ వాటికి వచ్చే కామెంట్స్ చూసుకుంటూ రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు.అయితే యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తెస్తుంది.ఇక కొత్తగా రీల్స్ ను ప్రవేశపెట్టగా.. వీటికి మంచి ఆదరణ లభించింది. ఇక వాట్సప్ స్టేటస్ తరహాలో ఫేస్ బుక్ లో కూడా స్టోరీ పెట్టుకునే ఆప్షన్ ను కూడా తీసుకొచ్చింది. ఇలా అనేక కొత్త ఫీచర్లను కూడా ఫేస్ బుక్ తీసుకొస్తూనే ఉంది.తాజాగా ఇక మరో అదిరిపోయే ఫీచర్ ను కూడా ఫేస్ బుక్ తీసుకొస్తుంది.


ప్రస్తుతం ఫేస్ బుక్ ఫీడ్ అనేది మన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తుంది. అలాకాకుండా మీకు ఎవరి నుంచి ఫీడ్ కావాలో వారిది సెలక్ట్ చేసుకుంటే వారి ఫీడ్ అనేది సపరేట్ గా చూపిస్తుంది. దీని కోసం మెయిన్ హోమ్ ట్యాబ్ ఫీడ్స్ అనే కొత్త ట్యాబ్ ని తీసుకురానుంది.ఇక ఇందులో మీరు సెలక్ట్ చేసుకున్నవారి ఫీడ్ మాత్రమే కనిపిస్తుంది. అండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ యూజర్లకు కూడా ఈ ఆప్షన్ ని తీసుకురానుంది.ఇక ప్రస్తుతం ఇండియాలో ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. వారం రోజుల్లో ఈ కొత్త ఆప్షన్ అనేది ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎగువన ఇంకా ఐఓఎస్ యూజర్లకు దిగువున ఈ ఆప్షన్ కనిపించనుంది.ఇంకా ప్రధాన ట్యాబ్ డిస్కవరీ ఇంజిన్ ఆధారంగా మెయిన్ ట్యాబ్ లో ఈ ఫీడ్ అనేది కనిపిస్తుందని ఫేస్ బుక్ వర్గాలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: