పుష్ప సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత పరిచయస్తురాలుగా  మారిన గీతూరాయల్ జబర్దస్త్ ద్వారా కూడా మరింతగా అభిమానులను సొంతం చేసుకుంది . మొదట్లో సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న గీతు భాషతో.. తన మాటతీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి చిత్తూరు యాసతో మాట్లాడుతూ ప్రేక్షకులకు మరింత చేరువయింది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్బాస్ సీజన్ సిక్స్ లోకి కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఊహించని  విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే . అయితే ఈమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులారిటీని సంపాదించుకొని టైటిల్ విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు.

కారణం మొదటి ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్లో హైలైట్ అవుతూనే వస్తోంది. కానీ ఊహించని విధంగా ఈమె ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ వెళ్లిపోయిందా? అని అనుకున్న వారి కంటే.. పీడ విరగడయింది.. గీతు బాధ తప్పిపోయింది ..అనుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పాలి. మొదటివారం నుంచి బాగానే ఉన్న గీతూ చివరి రెండు వారాలలో ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల , ఆమె ప్రవర్తన వల్ల బయటకు వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  కానీ గీతూ బిగ్ బాస్ నుంచి బయటకు రావడానికి అసలు కారణం వేరే ఉంది.  అదేమిటంటే బిగ్బాస్ కి వెళ్ళకముందు జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో అలరించిన గీతు తనదైన యాస తో అందరినీ ఆకట్టుకుంది.

ఇప్పుడు బిగ్బాస్ నుంచి బయటకు రాగానే కాళీ లేకుండా వచ్చేముందే పుష్ప 2 సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందనీ సమాచారం.  పుష్ప స్కిట్ వల్ల గీతు పుష్ప 2 లో కూడా అవకాశం అందుకుందని ప్రస్తుతం ఈమెపై షూటింగ్ నిర్వహించాల్సి ఉండగా కావాలనే హౌస్ నుంచీ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ప్లాన్ ప్రకారమే గీతూ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: