ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం వరుసగా వింత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేస్తూ ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకానొక సమయంలో వారు పడ్డ ఇబ్బందులను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ తమకు జరిగిన అనుభవాలను కూడా పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు తమ కున్న వింత వ్యాధుల గురించి తెలియజేస్తూ ఉన్నారు.


అలా టాలీవుడ్ హీరోయిన్ సమంత మయోసైటీస్  అనే  వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీలు కూడా తమకు వచ్చిన వ్యాధుల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా బుల్లితెర, వెండితెర పైన మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి వనిత విజయ్ కుమార్ సైతం ఒక వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. గతంలో ఎన్నో సినిమాలలో హీరోయిన్గా సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది వనిత విజయ్ కుమార్..తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్యలను బయట పెట్టడం జరిగింది. తను" క్లాస్త్రోఫోబయా" అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది.


అయితే ఈ వ్యాధి వచ్చినవారు ఎలా ఉంటారు అంటే ఎక్కువగా చిన్న చిన్న ప్రదేశాల లోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చాలా తక్కువ మందిత ఉండడానికి  మక్కువ చూపుతుంటారు.. లిఫ్ట్ వాష్ రూమ్ వంటి వాటిలో ఎక్కువసేపు ఉండాలన్న చాలా భయంగా ఉంటుందట. ఎక్కువగా జనాలు మధ్యలో ఉన్నప్పటికీ వారికి ఊపిరాడదనే భయం కూడా కలిగి ఉంటుందని తెలియజేస్తోంది వనిత విజయ్ కుమార్. అయితే తనకు ఇలాంటి వ్యాధి ఉందని విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తను ఇలాంటి వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని ధైర్యంగా ఉండమంటూ కూడా సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ వ్యాధికి సంబంధించి వనిత విజయ్ కుమార్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: