జియో పేరుతో టెలికం రంగంలో అడుగుపెట్టి.. ఆ రంగంలో ఉన్న ఇతర సంస్థలకు ముచ్చెమటలు పట్టించింది.. ప‌ట్టిస్తోంది. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగంలో మొబైల్ డేటా విప్లవానికి తెర లేసింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వడంతో ఇతర నెట్ వర్క్ యూజర్లంతా జియో బాటపట్టారు. చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తమ కస్టమర్లను ఆకర్షించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర నెట్ వర్క్ లు కూడా జియో బాటలోనే డేటా ధరలతో ముందుకొచ్చాయి. ఇదిలా ఉంటే.. రిలయెన్స్ జియో నుంచి రోజూ 1.5 జీబీ, 2జీబీ మొబైల్ డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి. 

 

ఇటీవల రిలయెన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్‌ని సవరించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ని ప్రకటించింది. మరి ఏ ప్లాన్‌లో ఎలాంటి డేటా బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి. జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 42 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటా వాడుకోవచ్చు.

 

అలాగే జియో రూ.555 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 126 జీబీ డేటా వాడుకోవచ్చు.  జియో రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 84 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో రూ.2,020 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 547.5 జీబీ డేటా వాడుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: