శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎం 30ఎస్ పేరిట ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇందులో ఉంది. అలాగే 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే, వెనుక భాగంలో 48+8+5 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి. సెల్ఫీ ల కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించారు. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ధర విషయానికి వస్తే.. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999, హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.17,999గా నిర్ణయించారు.
టెక్నో స్పార్క్ 6 ఎయిర్: టెక్నో నుంచి టెక్నో స్పార్క్ 6 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ ను ఇటీవల విడుదల అయింది. ఇందులో కూడా 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. 7 అంగుళాల హెచ్ డీ+ డాట్-నాచ్ డిస్ ప్లే, వెనుక భాగంలో 13+2 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి. సెల్ఫీ ల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించారు. క్వాడ్ కోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ధర విషయానికి వస్తే.. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం31: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ ఇటీవల గెలాక్సీ ఎం 31 విడుదల చేసింది. ఇందులో కూడా 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఇందులో 6.4 అంగుళాల డిస్‌ప్లే, వెనుక భాగంగా 64+ 8+ 5+ 5ఎంపీ రియర్ క్వాడ్ కెమెరాలున్నాయి. సెల్ఫీ ల కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించారు. శాంసంగ్ ఎక్సినాస్ 9611 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ధర విషయానికి వస్తే. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,499 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,499గా నిర్ణయించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి