సాధారణంగా పాన్ కార్డు,ఆధార్ కార్డు లో ఏవైనా తప్పులు ఉంటే, మీ - సేవా కు వెళ్లి సరిచేసుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతం అలా కాదు. ట్రెండ్ మారింది. ఇప్పుడు మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు,అందులోనే అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది పాన్ కార్డులో తప్పులు ఉండడంతో సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలన్నింటినీ చెక్ పెట్టేందుకు,ఒక సులభమైన పద్ధతి వచ్చింది. అయితే పాన్ కార్డులో వున్న తప్పులు ఎలా సరిచేసుకోవాలో?ఇప్పుడు చేసుకుందాం.
NSDL (నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పాన్ కార్డులో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. NSDL e-Gov అనేది దరఖాస్తులు ఆమోదం తోపాటు ప్రాసెసింగ్ కోసం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేత నిర్వహించబడుతుంది. పన్ను చెల్లించేటప్పుడు పన్ను చెల్లింపుదారులు సూచించడానికి మరియు ఆదాయం పన్ను రాబడి చెల్లించడానికి ఈ వెబ్సైట్ తప్పనిసరి.
అయితే ఆన్లైన్ లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
NSDL e-Gov గవర్నెన్స్ పాన్ కార్డుకు ఏవైనా మార్పులను అభ్యర్థించడానికి,ఆన్లైన్ పథకాలను కూడా అందిస్తుంది. Onlineservices.nsdl.com లోకి వెళ్ళండి.
"అప్లికేషన్ టైపు" నుండి వచ్చిన ఎంపికలలో "changes or corrections existing Pan data " ఎంపికను ఎంచుకోండి.
ఇక దరఖాస్తుదారుడు ఇక్కడ అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
మీరు సబ్మిట్ చేసిన తర్వాత కొత్త పేజీకి మళ్ళించబడతారు. అయితే ఇక్కడ టోకెన్ నెంబర్ వస్తుంది.
ఈ టోకెన్ నెంబర్ ను దరఖాస్తు లో అందించిన e- మెయిల్ ఐడి కి కూడా పంపబడుతుంది.
ఇప్పుడు e - సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్ ను అందించి సబ్మిట్ చేయాలి.
ఇప్పుడు ఇక్కడ మీ పాన్ సంఖ్యను సూచిస్తుంది.
ఇక మీరు ఏవైతే వివరాలను మార్చుకోవాలి అనుకుంటున్నారో, వాటిని ఎంచుకుని,వాటి యొక్క ఎడమ అంచు పై సంబంధిత బాక్స్ ఎంచుకోండి.
ఒక దరఖాస్తుదారునికి సంబంధించిన అన్ని అడ్రస్ లను ఇక్కడ పొందుపరచుకోవాలి.
ఒక దరఖాస్తుదారుడు ఏ చిరునామా అయితే పునరుద్ధరించాలి అనుకుంటున్నాడో వారి వివరాలను జోడించి,పేజీలో పూర్తి చేయాలి.
దరఖాస్తుదారుడు చిరునామా మార్పు చేయించాలని అనుకున్నప్పుడు,కమ్యూనికేషన్ చిరునామా లేదా పేరు యొక్క ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి.
ఫారం నింపిన తరువాత రసీదు సృష్టించబడుతుంది.
ఈ రసీదును ప్రింట్ చేసి మిగిలిన పత్రాలను జత చేసి కింది చిరునామాలో పంపించండి.
Income Tax PAN service Unit - (Managed by NSDL e -Governance Infrastructure Limited)
5th Floor, Mantri Sterling, Plat No. 341,
Survey No. 997/8, Model Colony,
Deep Bungalow Chowk , pune - 411 016.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి