ఆస్ట్రియాకి చెందిన ఫేమస్ స్ట్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ (KTM) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఆర్‌సి390 (RC390) ఇంకా ఆర్‌సి200 (RC200) ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌లలో కంపెనీ రెండు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది.ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు ప్రస్తుతం కెటిఎమ్ ఆర్‌సి సిరీస్ మోటార్‌సైకిళ్లతోనే విక్రయించబడుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్పెషల్ ఎడిషన్ ఆర్‌సి బైక్‌ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇవి స్టాండర్డ్ మోడళ్ల ధరకే అమ్మబడతాయి.మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి390 జిపి (KTM RC390 GP) ధర రూ. 3,16,070 కాగా, కెటిఎమ్ ఆర్‌సి200 జిపి (KTM RC 200 GP) ధర రూ. 2,14,688 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్లను తమ పాపులర్ రేస్ బైక్ అయిన కెటిఎమ్ ఆర్‌సి16 మోటోజిపి (KTM RC16 MotoGP) నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి, ఈ రెండు స్పెషల్ ఎడిషన్లు కూడా ఈ రేస్ బైక్ లైవరీని క్యారీ చేస్తాయి.కొత్త స్పెషల్ ఎడిషన్ కెటిఎమ్ ఆర్‌సి బైక్‌ల  ఫెయిరింగ్ ఇంకా ఫ్రంట్ ఫెండర్‌లపై కనిపించే విలక్షణమైన డీకాల్స్‌తో పాటు ఆరెంజ్ బేస్ పెయింట్‌లో ఇవి ఫినిష్ చేయబడి ఉంటాయి. ఈ చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా కంపెనీ వీటి మెకానికల్ కాన్ఫిగరేషన్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు.


కొత్త RC390 ఇంకా RC200 స్పెషల్ ఎడిషన్ల కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.ఇంకా త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.సాధారణ కెటిఎమ్ ఆర్‌సి మోటార్‌సైకిళ్లు వైట్ అండ్ ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి. వాటి నుండి ఈ స్పెషల్ ఎడిషన్లను వేరు చేసేందుకు వీటిని ఎక్స్‌క్లూజివ్ ఆరెంజ్ షేడ్‌లో ఫినిష్ చేశారు. ఇంకా వాటిపై కెటిఎమ్ రేసింగ్ స్టిక్కర్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్స్ బైక్స్ లో కంపెనీ కేవలం చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే చేసింది కాబట్టి, వీటి ధరలను కూడా పెంచలేదు. ఇవి స్టాండర్డ్ కెటిఎమ్ ఆర్‌సి సిరీస్ మోటార్‌సైకిళ్ల ధరలకే అందుబాటులో ఉంటాయి.కెటిఎమ్ ఆర్‌సి390 జిపి ఎడిషన్ 373 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 42.41 బిహెచ్‌పి శక్తిని ఇంకా అలాగే 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.కాగా, కెటి ఆర్‌సి200 జిపి ఎడిషన్ 199 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 25.05 బిహెచ్‌పి పవర్ ను ఇంకా 19.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్ల కూడా 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ తో జత చేయబడి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTM