చాలా సంవత్సరాలుగా అద్భుతమైన ఆఫర్స్ కలిగిన రంగాలుగా ఉన్న వాటిలో సాఫ్ట్వేర్ రంగం ఒకటి. ఈ రంగంలో ఎవరైతే మంచి ప్రదర్శనను కనబరుస్తారో వారికి లక్షల్లో జీతాలు ఉంటాయి. దానితో అనేక మంది తల్లి దండ్రులు తమ పిల్లలు సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళాలి అని అనుకోవడం , అలాగే పిల్లలు కూడా భారీ జీతాలు వస్తూ ఉండడంతో సాఫ్ట్వేర్ రంగం లోకి ఎంట్రీ ఇవ్వడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. దానితో ప్రస్తుతం అనేక మంది ఈ రంగంలో మంచి స్థాయిలో కొనసాగుతున్నారు.

ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్ వచ్చిన వారికి అద్భుతమైన స్థాయిలో క్రేజ్ ఉంటుంది. కోడింగ్ వచ్చిన వారికి భారీ మొత్తంలో జీతాలు ఉండడం మాత్రమే కాకుండా విదేశాల్లోకి వెళ్లే అవకాశాలు పెద్ద ఎత్తున రావడం , అలాగే వారి ఎదుగుదల కూడా చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా కోడింగ్ వచ్చిన వారు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో వారికి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ పెద్ద షాక్ ఇస్తుంది. గత కొంత కాలంగా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపు వస్తున్న టెక్నాలజీలో AI (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) టెక్నాలజీ ఒకటి. దీని ద్వారా చాలా పనులు అత్యంత సులభతరం మరియు ఖర్చు తక్కువలో జరిగిపోతున్నాయి.

ఇకపోతే AI టెక్నాలజీ ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్ కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది. దానితో ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు AI టెక్నాలజీని పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాయి. దానితో కోడింగ్ వచ్చిన సిబ్బందిని కూడా తమ కంపెనీల నుండి తీసేస్తున్నారు. ఇక రాబోయే కాలంలో అనేక సాఫ్ట్వేర్ సంస్థలు కోడింగ్ కి సంబంధించిన AI టెక్నాలజీని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లు , దానితో కోడింగ్ వచ్చిన వారి పరిస్థితి మరింత కింది స్థాయికి వెళ్లే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: