విత్తనం శబ్దం లేకుండా పైకి ఎదుగుతుంది.. అదే విత్తనం మొక్కై, మానై  కుప్పకూలేటప్పుడు విపరీతమైన శబ్దాన్ని సృష్టిస్తుంది. ఏదైనా కూల్చేసేటప్పుడే శబ్దం వెలువడుతుంది.. అదే ఏదైనా క్రియేట్ చేయాలంటే ఎటువంటి హంగు ఆర్భాటాలు అవసరం లేదు. ఇదే నిశ్శబ్దం యొక్క శక్తి అని అంటారు ఏపీజే అబ్దుల్ కలాం గారు.. ఎంత సైలెంట్ గా ఎదుగుతామో, అంతే గొప్పగా జీవితంలో ఏదైనా సాధించ గలుగుతాము అన్న ఒక సిద్ధాంతం తో, ఆయన అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎన్నో మరెన్నో ప్రయోగాలు చేసి, భారత సైనిక అభివృద్ధి కోసం నిర్విరామంగా పని చేశారు.

ఇక ఈయన పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఇండియన్ మిసైల్స్.. అందుకే ఈయనను మనం ఇండియన్ మిస్సైల్ మాన్ అని పిలుచుకుంటాము. ఇక ఈయనకున్న దృఢసంకల్పం , ఏదైనా సాధించాలనే పట్టు, తపన, ఈయన లాంటి తత్వవేత్తను , దేశభక్తుడిని ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు, ఇక చూడబోము కూడా.. అంతటి మహోన్నత వ్యక్తి మన భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం మన గర్వకారణం. ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో అక్టోబర్ 15 1931వ సంవత్సరంలో జన్మించాడు. ఇక ఈయన పూర్తి పేరు అవూల్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం...


తిరుచిరపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. ఇక ఈయన భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా 2002 జూలై 25 వ తేదీ నుంచి 2007 జూలై 25 వ తేదీ వరకు కొనసాగాడు. ఇక ఈయన రాష్ట్రపతి కాక ముందు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ - DRDO లో ఒక ఏరోస్పేస్ ఇంజనీరుగా పనిచేశారు.


ఈయన ముఖ్యంగా  బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేశారు. 1977లో భారతదేశ క్షిపణి అణు పరీక్షల్లో కీలకమైన సంస్థాగత సాంకేతిక అలాగే రాజకీయ పాత్ర పోషించారు . అబ్దుల్ కలాం మొదట ఏరోస్పేస్ ఇంజనీర్ గా ఒక హెలికాప్టర్ ను కనుగొన్న తరువాత ఆయన తన వృత్తిని కొనసాగించడం జరిగింది. ఇక 2020నాటికి తన దేశం అత్యున్నత దేశంగా చూడాలనే ఒక్క కళతో, ఆయన ఒక పుస్తకం కూడా రాశారు. ఇక ఈయన భారత దేశానికి చేసిన సేవలకు గానూ అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డును కూడా పొందారు..



1981 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ అందుకోగా, 1990లో పద్మవిభూషణ్ అందుకున్నాడు. తర్వాత భారత రత్న, జాతీయ సమైక్యత కు గాను ఇందిరాగాంధీ అవార్డు, వీర్ సావర్కర్ అవార్డు , రామానుజన్ బహుమతి అలాగే ఎన్నో అవార్డులను అందుకోవడం విశేషం. అంతే కాదు వివిధ విభాగాల నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు కూడా పొందాడు. చివరిసారిగా ఈయన 2015 సంవత్సరం జూలై 27 వ తేదీన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్ లో ఉపన్యాసం ఇస్తున్న  సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే  గుండెపోటుతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: