ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ మీ కోసం.. చదవండి....! ఈ భూమ్మీద బాగా ఉత్సాహంగా వుండే ప్రాణులు ఏమన్నా వున్నాయంటే అవి కోతులు, కొండముచ్చులు అనే చెప్పాలి. అచ్చం మనిషిని పోలి వుండే కోతులు, కొండముచ్చులు  చాలా చిలిపి పనులు చేస్తుంటాయి. ఒక్కొక్కసారి చిత్ర విచిత్రమైన పనులతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక ఈ సారి కూడా అలాంటి పని ఒకటి చేశాయి. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాల్లోకి వెళితే... కోతులు ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరయ్యాయి. అల్లరి చేయకుండా ఎంతో శ్రద్ధగా, నిశబ్దంగా కుర్చొని పాఠాలు విన్నాయి. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

ఇక లాక్ డౌన్ వల్ల స్కూల్స్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు అందరు ఆన్లైన్ లో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఇక తాజాగా ఒక క్యూట్ చిన్నారి విద్యార్థి చక్కగా యూనిఫాం ధరించి.. మెడలో ఐడీ కార్డ్ వేసుకుని స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసులను వింటూ వుంది. అదే సమయంలో అక్కడికి మూడు కొండ ముచ్చులు వచ్చాయి. మహాత్ముడి కోతుల్లా.. ఎంతో బుద్ధిగా కిటికీకి వేలాడుతూ.. ఆ చిన్నారితో పాటే ఆన్‌లైన్ పాఠాలు విన్నాయి. దీంతో ఆశ్చర్యపోయిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఫొటో తీసి పోస్ట్ చేశారు. అంతే.. అది క్షణాల్లో వైరల్‌గా మారింది. అబ్బో.. కొండముచ్చులు ఎంత శ్రద్ధగా వింటున్నాయో అని మురిసిపోతున్నారు.

కోతులు కొండ ముచ్చులు రెండు ఒకే జాతికి చెందినవి. అయితే, కోతులకు.. కొండ ముచ్చులకు చిన్న వ్యత్యాసం ఉంటుంది. అల్లరి విషయంలో కోతులే ఎప్పుడూ ముందు ఉంటాయి. కొండముచ్చులు అల్లరి తక్కువ, పైగా కోతులంటే వాటికి అలర్జీ. అందుకే కోతులను తరిమేందుకు కొండముచ్చులను వదులుతుంటారు. కోతైనా.. కొండముచ్చైనా ఒకే జాతి ముత్యాలు కాబట్టి, అంత బుద్ధిగా క్లాసులు వినడం నిజంగా చిత్రమే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: