మనకు వచ్చే మూత్రం రంగును బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామో.. లేదో నిర్ణయిస్తారు డాక్టర్లు. ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే.. మూత్ర విసర్జన చేసినప్పుడు వచ్చే వాసన బట్టి కూడా ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవచ్చట. అంతే కాదు ఒకసారి మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మూత్రంలో వాసన అటు ఇటు అవుతుందట. అయితే మూత్రం వచ్చేటప్పుడు చిన్న చిన్న మార్పు సహజమే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. కానీ మూత్ర విసర్జన చేసినప్పుడు భరించలేని వాసన వచ్చినట్లయితే మనకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని గుర్తించాలి. మూత్రం వాసన ఎక్కువగా వచ్చినప్పుడు కలిగే సమస్యలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..1. డయాబెటిస్:
డయాబెటిస్ సమస్య ఉన్నవారికి మూత్రంలో తీపి కలిగిన వాసన వచ్చే అవకాశం ఉంటుంది.. అయితే దీనిని అందరూ షుగర్ పేషెంట్లు నార్మల్ గా తీసుకోవడం గమనార్హం. అయితే ఇన్సులిన్ ప్రొడక్షన్ లో తేడా వచ్చినప్పుడు బ్లడ్ లో అనేక సమస్యలు రావడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి.

2. లివర్ సంబంధిత వ్యాధులు:
లివర్ సంబంధిత వ్యాధులు వచ్చినప్పుడు కూడా మూత్రం వాసన వస్తుంది. లివర్ సమస్య వచ్చినప్పుడు మూత్రం మరీ భయంకరంగా వాసన వస్తుంది..ఎందుకంటే మలినాలు శుభ్రం కాకపోవడం వల్ల సూక్ష్మక్రిములు ఎక్కువయ్యి తద్వారా కుళ్ళిన వాసన రావడం గమనార్హం.

3. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్:
యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మూత్రం వాసన వస్తుంది ..ఈ విషయాన్ని ముందుగా గమనించకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

4.ఇంటెస్టైనల్ ఫిస్టులా :
ఇది కూడా అతి భయంకరమైన వ్యాధి అని చెప్పవచ్చు. ఇది మూత్ర విసర్జన చేసేటప్పుడు అతి భయంకరమైన వాసన రావడంతో పాటు మూత్రంలో బుడగలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.బ్లాడర్ కి ఇంటెస్ట్ టైన్స్ మధ్య సమన్వయం లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య కోసం కొలొస్టోమి అనే సర్జరీ మనకు అందుబాటులో ఉంది. డాక్టర్ ని అడిగి సర్జరీ మీద మరింత సమాచారం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: