దొంగల తో కాస్త జాగ్రత్త ..రాత్రిళ్ళు అయితే దొచుకుపోతారు.అనేది ఒకప్పటి మాట యిప్పుడు కాస్త ట్రెండ్ మారింది.పట్ట పగలే చొరీలకు పాల్పడుతున్నారు..అందరు చూస్తున్నా కూడా ఎవరూ మాట్లాడరు.అందుకే దొంగలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన కూడా పోలీసులు కొన్ని సార్లు లైట్ తీసుకోవడం తో దొంగలు వారి పని వాళ్ళు చేసుకొని పోతున్నారు..తాజాగా ఓ ముగ్గురూ దొంగలు పట్ట పగలే చొరీ చేస్తున్న ఘటన కు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
 

సోషల్ మీడియా వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్, వైరల్‌ న్యూస్‌కి కొదవే లేకుండా పోయింది. ఇంటర్నెట్ ఆన్ చేస్తే చాలు ఫన్నీ వీడియోస్ తెగ కనిపించేస్తుంటాయి.. పొరపాటున షూట్ అయ్యి ఉంటాయో తెలియదు కానీ.. మొత్తానికి ఇవి నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. వీడియో పాతదే అయినప్పటికీ, ఫన్నీగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తూ మరోమారు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు..ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.. ఓ ఆటో ట్రాలీ నిండా సామానుతో వెళ్తోంది. ఆ ఆటో ట్రాలీ వెనకాలే, ఓ యువకుడు వేలాడుతూ కనిపిస్తుంటాడు.. ఆ ట్రాలీలో ఉన్న వస్తువులను అతడు మెల్లిగా చోరీ చేస్తూ… తన వెనకాలే బైక్‌ పై వస్తున్న మరో వ్యక్తికి అందిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పటికీ చుట్టు పక్కల వాహనదారులు, ప్రయాణికు లు ఎవరూ పట్టించుకున్న పాపపోలేదు. ఎవరి మానాన వారు అదేమీ పట్టనట్లే ముందుకు వెళ్తున్నారు. వెనుక నుంచి కారులో వస్తున్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చెస్తున్నారు.మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: