సాధారణంగా కొంతమంది విద్యార్థులు ప్రతిరోజు ఎంచక్కా తల్లిదండ్రులు చెప్పినట్లుగా స్కూలుకు వెళ్లి బాగా చదువుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం స్కూల్ ఎప్పుడు ఎలా ఎగ్గొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది స్కూల్ ఎగ్గొట్టడానికి ఏవేవో కారణాలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చిన్నారులు చెప్పే కారణాలు ఎప్పుడు ఎంతగానో నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి. కేవలం స్కూల్ ఎగొట్టడానికి మాత్రమే కాదు హోంవర్క్ నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా కారణాలు చెబుతూ ఉంటారు చిన్నారులు.


 సాధారణంగా చిన్నారులు స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ ఇచ్చే హోంవర్క్ ని ఇంట్లో తమ పిల్లలతో చేయించడానికి తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకు వచ్చినంత పని అవుతుంది. ఎందుకంటే చిన్నారులు అడిగే ప్రశ్నలకు తల్లిదండ్రులు వారికి వచ్చింది కూడా మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు హోంవర్క్ నుంచి తప్పించుకోవడం కోసం చెప్పే రీజన్స్ మాత్రం ఎంతో ఫన్నీగా అనిపిస్థాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. హోమ్ వర్క్ నుండి తప్పించుకునేందుకు ఇక్కడ ఒక బుడ్డోడు చెప్పిన కారణం విని నేటిజన్స్  అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే హోం వర్క్ చేయిస్తున్న తల్లిపై చిన్నారి ఎంతో కోపంగా ఉన్నాడు. ఒక చిన్నారి పెన్సిల్ తో పుస్తకం పై హోం వర్క్ చేయిస్తూ ఉంటాడు.  అప్పుడు తన తల్లితో నా జీవితాంతం చదువుకుంటూ నేను ముసలి వాడిని అవుతాను.. పిచ్చి మమ్మీ అని ఏడుస్తూ చెబుతాడు.. ఇలా ఏడుస్తున్న సమయంలో ఆ చిన్నారి ఇచ్చిన రియాక్షన్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. నీకు ఎందుకు వృద్ధాప్యం వస్తుంది ఏబిసిడిలు రాయడంలో ముసలి వాళ్లు అయిపోతారా అంటూ అప్పుడు తల్లి ప్రశ్నిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: